విజయవాడ సింగ్‌నగర్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి ఘటనపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ స్పందిస్తూ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోడి కత్తి డ్రామాతో జగన్ అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు సింగ్ నగర్‌లో గులకరాయి దాడితో కొత్తనాటకానికి తెరలేపారంటూ విమర్శించారు. జగన్ పర్యటించిన ప్రదేశంలో వీధిలైట్లు కూడా లేనప్పుడు నిఘావర్గాలు ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఒక్క జగన్‌కే చీకట్లో గులకరాయి ఎలా తగిలింది? అంటూ ఎద్దేవా చేశారు. దీనికి బాధ్యత వహించి డీజీపీ తక్షణమే విధుల్లోంచి తప్పుకోవాలన్నారు. పవన్ కల్యాణ్‌పై , చంద్రబాబు నాయుడుపై రాళ్లు వేయించారని మండిపడ్డారు. ఎన్నికల్లో అరాచక శక్తులు అల్లర్లు చేయడానికి సిద్ధపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాటకాలు మానాలని... ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. గులకరాయి దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపినప్పుడు గొడ్డలిని స్వాధీనం చేసుకోకుండా ఏం చేశారని నిలదీశారు. ఎన్నికల్లో మరిన్ని అరాచకాలకు దిగుతారని తెలుస్తోందని కార్పొరేటర్ అన్నారు.
![]() |
![]() |