పాలకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై ధర్నా నిర్వహించినట్లు సీఐటీయూ నాయకులు డి. రమణా రావు తెలిపారు. జీవో ఎంఎస్ నెంబర్ 36 ప్రకారం కొత్త జీతాలు, బకాయి జీతాలు, సమ్మె కాలపు జీతం రూ. 1000 కానుక, యూనిఫారం కుట్టుకూలి మంజూరు తదితర సమస్యలు పరిష్కారం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కమిషనర్ కి వినతపత్రం అందజేశారు. యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.