వివేకా కుమార్తె సునీతను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి మండిపడ్డారు. క్రిమినల్ బ్రెయిన్ తో ప్రవర్తించే వ్యక్తి చంద్రబాబని నిప్పులు చెరిగారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టడమే చంద్రబాబు పని అని విమర్శించారు. ఎల్లో మీడియాతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి సాయంతో బురద జల్లిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయని రమేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ఎంపీగా గెలవాలని వివేకానందరెడ్డి కూడా ప్రచారం చేశారన్నారు. అయితే వివేకా కేసును బాబు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎవరిపై కక్ష సాధించేందుకు షర్మిల ఏపీ వచ్చారని ప్రశ్నించారు. షర్మిల, సునీత అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు.