లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాఖండ్-నేపాల్ సరిహద్దులను ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 72 గంటల పాటు మూసివేయనున్నారు. ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి. ఈ నేపధ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా సరిహద్దులను మూసివేసి ఎస్‌ఎస్‌బీ సిబ్బందిని నియమించారు. ఏప్రిల్ 16 సాయంత్రం 5 గంటల నుండి ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటల వరకు భారత్- నేపాల్ సరిహద్దులను మూసివేయనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa