విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో ఆదివారం రాత్రి ఘర్షణ తలెత్తింది. టీడీపీ నేతల నివాసాల వద్దకు వచ్చి కవ్వింపులకు దిగిన వైసీపీ కార్యకర్తలు ఇనుపరాడ్లు, కర్రలతో టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు మాట్లాడుతూ.... ఈ దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయాలపాలయ్యారు. వివరాల ప్రకారం... కొత్తూరు తాడేపల్లిలోని పైలమాలపల్లిలో ఆదివారం రాత్రి వైసీపీ కార్యకర్తలు మద్యం సేవించి గ్రామంలో హల్‌చల్ చేశారు. మోటార్ సైకిళ్లకు సైలెన్సర్లు తీసేసి మాలపల్లిలో చక్కర్లు కొడుతున్న సమయంలో రెండేళ్ల బాలుడికి మోటార్ బైక్ తగిలింది. ఈ విషయమై ఓ వృద్ధురాలు ప్రశ్నించగా వైసీపీ కార్యకర్తలు ఆమెపై దౌర్జన్యానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై ఇనుపరాడ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలు గారపాటి తిరుపతమ్మ, బొడ్డు పండు, కనపర్తి సత్యం, గారపాటి రమేష్‌బాబు, జి.అవినాష్ తీవ్ర గాయాలపాలయ్యారు. దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలు చప్పిడి రవివర్మ, చప్పిడి శివనాగరాజు, చిగురుపల్లి ఆంజనేయులు, జిల్లా బత్తుల మహేష్, సుఖపోగి శ్యామ్‌కుమార్, చప్పిడి కోటయ్య, చిగురుపల్లి బాబి తదితరులపై కేసు నమోదు చేశారు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa