ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్.. ఐదుగురు అనుమానిత యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరంతా విజయవాడ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందినవారిగా గుర్తించారు. వీరిలో సతీష్ కుమార్ అలియాస్ సత్తి అనే యువకుడు సీఎం జగన్‌పై రాయితో దాడి చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
తీష్‌తో పాటుగా ఆకాష్, చిన్న, సంతోష్, దుర్గారావులు ఉన్నట్లు చెబుతున్నారు. సతీష్ సీఎం జగన్‌పైకి ఫుట్‌పాత్ కోసం ఉపయోగించే టైల్స్ ముక్కను విసిరినట్లు సమాచారం. దాడి వెనుక ఉన్న కారణాలపై అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ సీసీఎస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
పోలీసులు టీమ్‌లుగా విడిపోయి.. శనివారం రాత్రి నుంచి వరుస దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ సుమారుగా 70మందిని ప్రశ్నించారు.. సీసీ టీవీ ఫుటేజ్‌లను సైబర్ ల్యాబ్స్‌కు పంపారు. వీరిలో కొందరు మైనర్లు ఉన్నట్టు తెలుస్తోంది.. వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపట్టారు.