రాయలసీమవాసులకు శుభవార్త.. ప్రత్యేక రైలు పట్టాలెక్కబోతోంది. కడప మీదుగా కాచిగూడ - కొచివేలి(త్రివేండ్రం)- కాచిగూడ ప్రత్యేక రైలు (07229 / 07230) నడపనున్నట్లు కడప రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి ఈ నెల 18, 25 తేదీల్లో (గురువారం) ఉదయం 6.05 గంటలకు బయలుదేరి మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి మీదుగా ఎర్రగుంట్లకు మధ్యాహ్నం 1.50కు, కడపకు 2.25కు చేరుకుంటుంది.
అనంతరం ఈ రైలు రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈ-రోడ్, కోయంబత్తూరు, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెంగనూరు, కొల్లాం మీదుగా కొచివేలికి శుక్రవారం ఉదయం 10.05 వెళుతుంది. తిరుగు ప్రయాణంలో కొచివేలిలో ఈ నెల 19, 26 తేదీల్లో(శుక్రవారం) మధ్యాహ్నం 12.50 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 6.25 గంటలకు కడప, ఎర్రగుంట్లకు 7 గంటలకు, సాయంత్రం 5 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.
మరోవైపు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సాధారణ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. ఎస్‌ఎంవీ బెంగళూరు – గౌహతి (06521) అన్ రిజర్వుడు స్పెషల్ ప్రతీ మంగళవారం రాత్రి 11.40 గంటలకు ఎస్‌ఎంవీ బెంగళూరులో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.18 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 6.20 గంటలకు బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున 4.50 గంటలకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 25 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో గౌహతి – ఎస్‌ఎంవీ బెంగళూరు (06522) అన్ రిజర్వుడు స్పెషల్ ప్రతి శనివారం గౌహతిలో ఉదయం 6.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 3.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 3.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.55 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.