జపాన్‌లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. దక్షిణ జపాన్‌లోని నాన్యో ప్రాంతంలో భూకంపాలు సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) వెల్లడించింది.జపాన్ ద్వీపాలు కైకూ, షికోకులను వేరు చేసే బుంగో చానల్ భూకంప కేంద్రంగా జేఎంఏ వెల్లడించింది.భూకంపాల వల్ల పెద్దగా నష్టం జరగలేదు. ఒక రియాక్టర్ పనిచేస్తున్నప్పటికీ, ఆ సమయంలో అణు కర్మాగారంపై ఎలాంటి ప్రభావం లేదని షికోకు ఎలక్ట్రిక్ పవర్ తెలిపింది.