వివాహేతర సంబంధాలు.. ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. అయినప్పటికీ కొందరు తమ భార్య, భర్త ఉండగానే పరాయి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాలతో ఆ రెండు జంటలే కాకుండా ఆ రెండు జంటల కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడతాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి.. తన భార్య వేరే వ్యక్తితో సంబంధాలు నడుపుతోందని గుర్తించి.. వారిని అడ్డంగా పట్టుకున్నాడు. దీంతో తన వద్ద ఉన్న బేస్‌బాల్ బ్యాట్‌తో తన భార్యను ఇష్టం ఉన్నట్లు చితకబాదాడు. ఈ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
తన భార్య వేరే వ్యక్తితో కారులో వెళ్లడాన్ని ఆమె భర్త దూరం నుంచి గమనించాడు. దీంతో మరో కారులో తన భార్య, ఆమె ప్రియుడు కలిసి వెళ్తున్న కారును వెంబడిస్తూ వెళ్లాడు. చివరికి వారి కారు ఒక ప్రదేశంలో ఆగింది. ఆ కారు వెనకాలే తన కారును ఆపిన ఆ వ్యక్తి మెల్లగా ఆ ముందు కారు వద్దకు వెళ్లాడు. కారు అద్దం మూసి ఉండటం, దాని వెనకాల ఒక తెరతో కప్పి ఉంచడాన్ని గమనించాడు. వెంటనే తనతోపాటు తెచ్చుకున్న బేస్‌బాల్ బ్యాటుతో ఆ కారు అద్దాన్ని ఒకేసారి బద్ధలు కొట్టాడు. దీంతో ఆ కారులో ఉన్న అతని భార్య ఒక్కసారిగా అరిచింది. అందులో ఉన్న మరో వ్యక్తి కూడా భయపడ్డాడు.
కారు అద్దాన్ని పగలగొట్టిన ఆ వ్యక్తి అందులో ఉన్న తన భార్యపై దాడి చేయడం ప్రారంభించాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో అతని భార్య కేకలు పెట్టింది. అనంతరం కారు డోరు తీసి బయటికి తీసుకువచ్చి.. తన భార్యపై మరింత భీకరంగా దాడి చేశాడు. హర్యానాలోని పంచకుల నగరంలో జరిగిన ఈ సంఘటనను పక్కనే ఉన్న మరికొందరు వ్యక్తులు వీడియోలు తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో మహిళను అతని భర్త చితకబాదడం కనిపిస్తోంది. చివరికి అక్కడ ఉన్న స్థానికులు.. ఆ భర్తను ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే తనపై దాడి చేశాడని ఆ మహిళ.. తన భర్తపైనే ఫిర్యాదు చేయడం ఆ ఘటనలో మరో ట్విస్ట్. మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భర్త ఉండగా ఇదేం పాడు బుద్ధి అంటూ మండిపడుతున్నారు. ఇక మరికొందరు అయితే కేవలం మహిళను మాత్రమే కొడుతున్నాడని.. ఆమె ప్రియుడిని కలిపి ఇద్దర్నీ వాయించండి అంటూ సలహా ఇస్తున్నారు.
భర్తతో కాకుండా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుని.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందే కాకుండా తిరిగి భర్తపైనే కేసు పెట్టడం ఏంటని ఇంకొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు అలా ఎలా కేసు తీసుకుంటారంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇక ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే మరికొందరు కూడా ఇలాగే తయారవుతారని పేర్కొంటున్నారు.