ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఆర్టీసీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో వెంకట్రామిరెడ్డి వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. వెంకట్రామి రెడ్డి పంచాయతీరాజ్ శాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.