లావేరు మండలం మురపాక పంచాయతీ పరిధిలోని చల్లయ్యమ్మ అగ్రహారంలో (కొత్తపేట) నూతనంగా నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయ ప్రారంభోత్సవ వార్షికోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మురపాక వాస్తవ్యులు తేనెల మంగయ్య మాష్టారు జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు, పంచాయతీ పాలకవర్గం చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు రూ. 58, 000లు విరాళాన్ని అందజేశారు. ముందుగా వారు స్వామివారిని దర్శించుకున్నారు.