జిల్లా వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రాజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్ గురువారం జిల్లాకు చేరుకున్నారు. వీరిని జెడ్పీ అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ దీపిక మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలోని ఎన్నికల పరిస్థితిని జిల్లా వ్యయ పరిశీలకులకు వివరించారు. అదేవిధంగా జిల్లాలో ఎన్నికల సందర్భంగా తీసుకున్న చర్యలను వివరించారు. వీరి వెంట లైజన్ ఆఫీసర్లు కూడా ఉన్నారు.