తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఐదు రోజుల కిందట విజయనగరం, నెల్లిమర్ల రావాల్సి ఉండగా పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఈ నెల 23న పర్యటన ఖరారైంది. ఇదిలా ఉండగా అంతకుముందు ఈ నెల 21న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా శృంగవరపుకోట వస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి ఆ రోజు సాయంత్రం స్థానిక దేవిబొమ్మ కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పలరామప్రసాద్ గురువారం స్థల పరిశీలన చేశారు. ఎన్నికల ప్రచారం అనంతరం చంద్రబాబు రాత్రి బసకు కూడా స్థానికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు నెలల క్రితం ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం ఇక్కడ చేపట్టారు. నెల రోజుల క్రితం ఈ నియోజకవర్గ పరిధిలోని లక్కవరపుకోట మండలం సోంపురం కూడలి వద్ద పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభ నిర్వహించారు. టీడీపీ కంచుకోట శృంగవరపుకోటను గత ఎన్నికల్లో కోల్పోవడంతో ఈ ఎన్నికల్లో అధినేత ప్రత్యేక దృష్టిసారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa