ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవని పెద్ద సంఖ్యలో ఓటర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై శుక్రవారం తెలిపారు. పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు గల్లంతైన చోట్ల రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో 62.19 శాతం ఓటింగ్ నమోదైంది. కోయంబత్తూరు స్థానానికి బిజెపి అభ్యర్థిగా ఉన్న అన్నామలై మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అనేక మంది బిజెపి కార్యకర్తల పేర్లు లేకపోవడంతో కొంత రాజకీయ జోక్యం ఉందని అనుమానాలు ఉన్నాయని అన్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, తమిళనాడు ఓటర్లు ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.ఎన్నికల కోసం 190 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, 1.3 లక్షల మంది పోలీసులను మోహరించారు. ఇంకా 3,32,233 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు.