టీడీపీ అధినేత చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులే కాకుండా పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు సైతం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఒక అనుభవజ్ఞుడైన నాయకుడని.. ఆయన నిత్యం ఏపీ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతుంటారని మోదీ కొనియాడారు. ప్రజల సేవలో ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నానని మోదీ తెలిపారు.
![]() |
![]() |