టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ కళ్యాణ్ అజెండానా? అని వైయస్ఆర్‌సీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్‌లో పవన్ కల్యాణ్‌కి ఎంత ముట్టిందో చెప్పాలంటూ మహేష్ డిమాండ్ చేశారు. పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ...... చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారని అందరికి తెలుసు. జైలులో ములాఖత్ తర్వాత పవన్ కొన్న ఆస్తులు ఎన్ని?. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు నేనే బయటపెడతా’’ అని పోతిన హెచ్చరించారు. కౌలు రైతుల పేరుతో ఎన్నారైల నుంచి వసూలు చేసిన చందాలెంత?. అందులో రైతులకు ఇచ్చినది ఎంత? పవన్ కళ్యాణ్ వెనకేసుకొన్నది ఎంత? నాదెండ్ల మనోహర్‌కి స్పోర్ట్స్ కారు కొనేందుకు పది కోట్లు ఎవరిచ్చారు? ఏ ఎజండాతో పవన్ పార్టీ పెట్టారు. ఏ జెండా కోసం పనిచేస్తారు? చంద్రబాబు పల్లకీ మోయటమే పవన్ లక్ష్యమా? కాపు యువతని టీడీపీ జెండాలు మోసే కూలీలుగా పవన్ భావిస్తున్నారా? జనసైనికులకి పవన్ సమాధానం చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.జనసేనను వీడిన వాళ్లంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరుతున్నారు. పది జిల్లాలో అస్సలు జనసేన పార్టీనే లేదు. చంద్రబాబు ఆర్ధిక ప్యాకేజీకి పవన్ అమ్ముడుపోయాడు. జైలు వద్ద బాబుతో ములాఖత్ అయ్యాక పవన్ చాలా ఆస్తులు కొన్నారు. ఆ వివరాలు నా దగ్గర ఉన్నాయి. మంగళగిరి లో పార్టీ కార్యాలయం కొనుగోలుకు ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయి. ఎలెక్ట్రోల్ బాండ్స్ పేరుతో ఎంత సేకరించారో వెబ్ సైట్‌లో పెట్టాలి’’ అని పోతిన మహేష్ అన్నారు.టీటీడీకి ఒక్కరూపాయి కూడా పవన్ విరాళం ఇవ్వరు. ఖాజా దగ్గర ఉన్న దశావతారం టెంపుల్‌కే విరాళాలు ఇస్తారు. ఎందుకో పవన్ చెప్పాలి. నాగబాబు ,రుక్మిణి , సెక్యూరిటీ ఖర్చులు కూడా చలమలశెట్టి నరసింహారావు భరిస్తారు. పార్టీ డబ్బులు ఏమి చేస్తున్నారో పవన్ చెప్పాలి. పవన్ ప్యాకేజీ డబ్బులు బ్లాక్ మనీని హరిహర వీరమల్లు సినిమా ద్వారా వైట్ మనీగా మార్చుతున్నారన్నది నిజం కాదా?. పవన్‌పై దిల్ రాజు ఐటీకి ఫిర్యాదు చేసింది నిజం కాదా?. పవన్ ఫ్యామిలీది బ్రాండ్ కాదు మోసం, దగా అంటూ పోతిన మహేష్ నిప్పులు చెరిగారు. జనసేన అభ్యర్థులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన ను టీడీపీ లో విలీనం చేసేసారా?. రాజకీయాలని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించటంలో నాదెండ్ల మనోహర్ దిట్ట. నా ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటే ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమని పోతిన మహేష్ సవాల్ విసిరారు.