టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే హత్యా రాజకీయాలకు పాల్పడుతోందంటూవైయస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. సాక్షాత్తూ సీఎంపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. మంగళగిరి వైయస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డిని ఢీకొట్టి చంపేశారని, వైయస్ఆర్సీపీ నాయకులు, సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయి. కేసులుంటే పదవులని లోకేష్ చెబుతున్నాడు. ఓటమి అంచున ఉన్నారు కాబట్టే దాడులకు పాల్పడుతున్నారు. చంద్రబాబుకు అభివద్ధి.. పాలన చేయడం తెలుసా? పాలన చేతనైతే ఎందుకు ఐదేళ్లలో ఏం చేయలేకపోయారు? అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.