ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు,జాతీయప్రధాన కార్యదర్శి లోకేష్ లతోపాటు ఏపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిన వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజి మంత్రి రావెల కిషోర్ బాబు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసి ఆధారాలను అందించారు.చంద్రబాబు ఈనెల 19 వతేదీన రాయదుర్గం,ఆలూరు నియోజకవర్గాలలో జరిగిన బహిరంగసభలలో ముఖ్యమంత్రి జగన్ గారిపై ,నిరాధారమైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు.ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగిస్తూ హత్యారాజకీయాలను ప్రేరేపించేవిధంగా ప్రసంగాలు ఉన్నాయని వాటిని స్పూర్తిగా తీసుకుని టిడిపి కార్యకర్తలు హింసకు పాల్పడి తాడేపల్లిలో వెంకటరెడ్డి అనే వైయస్సార్ సిపి కార్యకర్తను దాడి చేసి చంపేశారని ఫిర్యాదు చేశారు. ఏపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రకాశం జిల్లాలో రాజకీయ ప్రచారం లో పాల్గొన్నందుకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అనుసరించి అతని పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.