సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఆదివారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు చంద్రబాబు బీ.ఫామ్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి గిడ్డి ఈశ్వరి, ఎంఎస్ రాజు, రఘురామ కృష్ణంరాజు వచ్చారు. పాడేరు టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే రమేష్ నాయుడు పేరు తెలుగుదేశం ప్రకటించింది. అయితే పాడేరు అభ్యర్థిగా తనకు పోటీ చేసే అవకాశం చంద్రబాబు కల్పించారని గిడ్డి ఈశ్వరి అన్నారు. తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ.. బీ.ఫామ్ తీసుకునేందుకు వచ్చానని అన్నారు. అలాగే మడకశిర స్థానం ఆశిస్తున్న ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు కూడా ఆదివారం ఉదయం చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీ.ఫామ్ కార్యక్రమానికి రావాల్సిందిగా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిన నేపథ్యంలో తాను చంద్రబాబు నివాసానికి వచ్చానని ఎంఎస్ రాజు తెలిపారు.
![]() |
![]() |