తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. ఇప్పుడు వాతావరణం కాస్త చల్లబడింది. పలు చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని విత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని స్పష్టం చేసింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది.
![]() |
![]() |