పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సోమవారం ఒంగోలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎర్రగొండపాలెంలో కాంగ్రెస్ అభ్యర్థి బూదాల అజితారావు నామినేషన్ కార్యక్రమానికి ఆమె హాజరవుతారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈమేరకు డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి శనివారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అజితారావు నామినేషన్, అనంతరం జరిగే సభకు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జునరావు పాల్గొన్నారు.
![]() |
![]() |