శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సోమవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దర్శించుకోనున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సుండిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సాక్షిగణపతి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని శ్రీశైలంలోని భ్రమరాంబ సదన్ అతిఽథి గృహానికి చేరుకుంటారు. తరువాత క్షేత్రపరిధిలోని బయలు వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం తిరిగి హైదరాబాద్‌కు చంద్రబాబు వెళ్లనున్నారు.