తాడిమర్రి మండలం నిడగళ్లు గ్రామంలో ధర్మవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు మండల నాయకుల ఆధ్వర్యంలో మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ముందుగా ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఇంటిటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన ప్రజలకు తెలిపారు.
![]() |
![]() |