గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీకి కొత్త తిప్పలు మొదలయ్యాయి. నామినేషన్ దాఖలు చేసేందుకు.. నామినేషన్ పత్రాల్లో ప్రతిపాదించే వ్యక్తి సంతకం చేయాలి. అయితే నీలేశ్ పత్రాలపై సంతకం చేసిన ముగ్గురు వ్యక్తులు.. తాము సంతకం చేయలేదని యూటర్న్ తీసుకున్నారు. దీంతోనీలేశ్‌కి జిల్లా ఎన్నికల అధికారి ఇవాళ ఉదయం 11 గంటల్లోపు వివరణ ఇవ్వాలని కోరారు.