రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. అక్లీరా ప్రాంతంలోని పంచోలా గ్రామ సమీపంలో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 9 మంది చనిపోయారు. వీరంతా మధ్యప్రదేశ్‌లో తమ బంధువుల వివాహ వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను అక్లీరా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.