బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌ను సూసైడ్ గేమ్ అని కూడా పిలుస్తారు. దీనిని రష్యాకు చెందిన పిలిప్స్ బెడీకిన్ అనే వ్యక్తి 2013లో క్రియేట్ చేశాడు. ఈ ఆన్‌లైన్ ఛాలెంజ్ గేమ్ ఆటగాళ్లను 50 రోజులలోపు ఆత్మహత్య చేసుకునేలా ఒత్తిడి చేస్తుంది. ప్రతి రోజు ఏదో ఒక ధైర్య సాహసాన్ని ప్రదర్శించి, వాటిని చిత్రీకరించాలి. నీటి నుంచి ఒడ్డుకు వచ్చి, ప్రాణాలు తీసుకునే తిమింగలం ప్రవర్తన ఆధారంగానే ఈ గేమ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.