అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రమాదకారి అని వైయస్ఆర్‌సీపీ నేత, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి తెలియకుండా ఏపీలో హత్యలు జరగవంటూ సంచలన ఆరోపణలు చేశారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోసాని కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడుతూ..... మీ అమ్మను తిడితే లోకేశ్ చొక్కా పట్టుకున్నావా..? నిన్న పవన్ కల్యాణ్ గారికి చాలా కోసం వచ్చింది.. బాధ వచ్చింది. ఆయన భార్యలని పెళ్లాలు అని అంటున్నారట.. పెళ్లాన్ని పెళ్లాం అనడానికి వీళ్లేదట. పవన్ కల్యాణ్..! పెళ్ళాం.. అని ఎందుకు అనకూడదు? అనొచ్చు. పోసాని పెళ్లాం అనొచ్చు..చిరంజీవి పెళ్లాం..చంద్రబాబు పెళ్లాం, లోకేశ్ పెళ్లాం అని అనొచ్చు. నువ్వు పెళ్లాం అన్నందుకే ఇంత ఉక్రోషం, కోపాన్ని వ్యక్తం చేశావు. మరి మీ అమ్మగారిని నీ పక్కనే ఉన్న లోకేశ్ అమ్మనాబూతులు తిడితే ఏం చేశావ్? కనీసం నారా లోకేశ్‌ను చొక్కా పట్టుకున్నావా? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాబూతులు తిట్టించాడని పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు. మరి నారా లోకేశ్‌ను ఎందుకు ఏం మాట్లాడలేదు? మరి నారా లోకేశ్‌ను ఏమైనా అనే దమ్ముందా? వాళ్ల అమ్మగారిని ముఖం చూసే దమ్ముందా నీకు? ఆమె పేరు ఎత్తాలంటేనే భయపడిపోతావెందుకు? ముఖ్యమంత్రి గారు అంత చీప్ అయిపోయా? పెళ్లాం అనే పదం ఆంధ్రదేశంలో 75 శాతానికి పైగా వాడతారు. పెళ్లాం అంటే ఆక్షేపణీయమా? జగన్ గారిని తిట్టాలంటే ఏదో కారణం వెతుక్కోవడం తప్ప. నిన్ను అవమానించడానికి సీఎం గారు నీలా అంత దిగజారి లేరు అని అన్నారు.