పీలేరు నియోజకవర్గం జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్లే అభ్యర్థిగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సోమవారం ఆయన పీలేరు తహశీల్దారు కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ అయిన ఫర్మాన్అహ్మద్ ఖాన్ కు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.