అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారాయణని వైఎస్ఆర్ సీపీ క్రిస్టియన్ పాస్టర్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పలువురు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకుంటున్నట్లు తెలియజేశారు. అదే విధంగా అనంతపురం ఎంపీ అభ్యర్థిగా శంకర నారాయణ అత్యధిక మెజార్టీతో గెలవాలని ప్రార్థన నిర్వహిస్తామని తెలియజేశారు.