కనిగిరి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు సోమవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటి ప్రభంజనం సృష్టించారు. మొత్తం 84 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 73 మంది ప్రధమ శ్రేణిలో, ఐదు మంది ద్వితీయ శ్రేణిలో, ఒక్కరు తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని ఆదర్శ పాఠశాలలలో మొదటి స్థానాన్ని కనిగిరి ఆదర్శ పాఠశాల విద్యార్థులు కైవసం చేసుకుని ప్రతిభను చాటి ఆదర్శానికే ఆదర్శంగా నిలిచారు.