అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని ప్రజలను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం రెండు జరుగుతాయని రవికుమార్ తెలియజేశారు.