పెద్దపాడు నుంచి మరో వంద కుటుంబాలు శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం టీడీపీలో చేరారు. గ్రామానికి చెందిన వైకాపా నాయకులు నక్క రాము, బొట్ట కామరాజు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో టీడీపీ కండువాలను కప్పుకున్నారు. శంకర్ మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో పెద్దఎత్తున చేరికలు, కూటమిపై నమ్మకం, చంద్రబాబుపై విశ్వాసంతో పార్టీలోకి వస్తున్నారన్నారు.