ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి మంగళవారం చీరాల పర్యటనకు రానున్నారు. చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తో కలిసి ఆమె భారీ ర్యాలీలో పాల్గొంటారు. తదుపరి గడియార స్తంభం సెంటర్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా ఎక్కడ బహిరంగ సభ జరిగినా అక్కడి ప్రజాప్రతినిధులను ఎండగడుతున్న షర్మిల చీరాలలో ఏం మాట్లాడుతారో అన్న ఉత్కంఠ నెలకొంది. షర్మిల సమక్షంలోనే ఆమంచి నామినేషన్ కూడా వేస్తారు.