టెన్త్ పరీక్షా ఫలితాల్లో పాయకరావుపేట మండలం గుంటపల్లి హైస్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. గట్టెం శ్రీలేఖ 591 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది. కక్కల షర్మిల(552), జి. సిరియేఘన వల్లి (549), గట్టెం లోకేష్ (549) మార్కులు సాధించారు. గుంటపల్లి హైస్కూల్ 91 శాతం ఫలితాలు సాధించింది. ఈ మేరకు మంగళవారం జనసేన పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఈ విద్యార్థులను అభినందించారు.