చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని పులివెందుల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి మారెడ్డి లత రెడ్డి అన్నారు. మంగళవారం లింగాల మండలంలోనిచిన్నకుడాల, రామన్నూతల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అందించే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.