విజయవాడ లోక్ సభ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని కుటుంబ స్థిర, చరాస్తులు రూ.77.32 కోట్లు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్తులు రూ.69.26 కోట్లు, చరాస్తులు రూ.8.06 కోట్లు, అప్పులు రూ.38.69 కోట్లు, మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్, మహీంద్రా థార్, టాటా సఫారీ, టాటా హారియర్, మహీంద్రా ఎక్స్ యూవీ రకం 6 లగ్జరీ కార్లున్నాయి.