పదవ తరగతి ఫలితాలలో కొండాపురం పట్టణానికి చెందిన ఒంటెద్దు ప్రభాకర్ రెడ్డి, పావనిల కుమారుడు సాయి గౌతమ్ రెడ్డి 600 మార్కులకు గాను 593 మార్కులు సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం కొండాపురం ఎస్సై పీ. యోగేంద్ర, సిబ్బంది కలిసి సాయి గౌతమ్ రెడ్డిని ఆయన నివాసంలో అభినందించారు. ఎస్సై మాట్లాడుతూ. అత్యుత్తమ మార్కులు సాధించిన సాయి గౌతమ్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.