టీడీపీ అధినేత, చంద్రబాబు జడ్జి ముందు ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. నగరంలోని గజపతినగరం సివిల్ జడ్జి కోర్టులో ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ దాఖలు చేశారు. అనంతరం జడ్జి ఎదుట అఫిడవిట్‌తో చంద్రబాబు ప్రమాణం చేశారు. ఎందుకు ప్రమాణం చేయాల్సి వచ్చిందంటే.. కుప్పం టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న ఈ నానిమేషన్లు దాఖలు చేయడం జరిగింది. అయితే.. ఒకరి తరఫున మరొకరు నామినేషన్లు దాఖలు చేస్తే.. ఇలా జడ్జికి నామినేషన్ పత్రాలు సమర్పించి.. ప్రమాణం చేయాల్సి ఉంటుంది.. అందుకే భువనేశ్వరి నామినేషన్లు దాఖలు చేయగా.. చంద్రబాబు ఇప్పుడు ప్రమాణం చేశారు.