ఈ సైకో(జగన్)ను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ప్రజాగళం’లో భాగంగా పాతపట్నం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? అని ప్రశ్నించారు. తాడేపల్లిలో కూర్చొని మీ తలరాతలు రాస్తాడా అని నిలదీశారు.జగన్‌ని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్‌కు ఇదే చివరి ఛాన్స్ కావాలన్నారు. తనకు రాజకీయాలు కొత్త కాదని చెప్పారు. రాష్ట్రం గాడి తప్పిందని.. .రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.జగన్ పాలనలో విద్యుత్ చార్జీలు పెరిగాయని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అన్నారని..నాసిరకం మద్యం అమ్మకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జే.టాక్స్. గంజాయి సరఫరా పెరిగిపోయిందని ఆరోపించారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి అమ్మితే కఠిన చర్యలు తీసపుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.జాబు కావాలంటే బాబు రావాలని అది తన బ్రాండ్ అని... గంజాయి కావాలంటే జగన్ రావాలి...అది ఆయన బ్రాండ్ అని చంద్రబాబు సెటైర్లు గుప్పించారు.