గుంతకల్లు పట్టణం పాతగుత్తి రోడ్డులో వెలసిన శ్రీ అంబమ్మదేవి రథోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది. ఉదయం శ్రీ అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి అర్చకులు అభిషేకాలు, అర్చనలు, విశేష పుష్పాలంకరణ చేశారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తిని రథంపై అధిష్టించి పూజలు చేశారు. రథోత్సవం చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీ అమ్మవారికి మొక్కులు తీర్చుకుని రథాన్ని లాగారు. పోలీసులు భద్రత కల్పించారు.