సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్, నియోజకవర్గ ఆర్ఓ అభిషేక్ కుమార్ ఆధ్వర్యంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్లు స్వీకరించారు. స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి, జై భీమ్ భారత్ తరపున నాగరాజు, ఏపీ రాష్ట్ర సమితి పార్టీ తరఫున నౌషాద్ నామినేషన్లు దాఖలు చేశారు.