శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ సమీపంలోని పూలకుంట వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరవపల్లికి చెందిన శ్రీరాములు (45) మృతి చెందారు. లేపాక్షి రహదారిలో టాటా ఏస్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.