ఐదేళ్ల పాలనలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భీమిలి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని హామీ ఇచ్చారు. జి. వి. ఎం. సి. 6వ వార్డులో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన మంగళవారం రేవళ్లపాలెంలో జరిగిన సభలో మాట్లాడుతూ అభివృద్ధిలో భీమిలిని రాష్ట్రంలోనే నెంబర్ వన్ చేస్తానన్నారు.