ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొమ్మిలింగం గ్రామ సమీపంలో మంగళవారం అక్రమంగా తరలిస్తున్న నాటు సారాను 60 లీటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటసార తరలిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారని అర్ధవీడు ఎస్సై అనిత వెల్లడించారు. నాటు సారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు పట్టుపడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరినీ త్వరలో పట్టుకుంటామని ఎస్సై అనిత చెప్పారు.