ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డికి నామినేషన్లను అందజేశారు. రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా బ్రహ్మానాయుడు, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి వెంకట స్వామి, స్వతంత్ర అభ్యర్థులుగా సుధాకర్, అనిత, శ్రీనివాసరావు, నారాయణరావు, దాసరి సుందరం నామినేషన్లు దాఖలు చేశారు.