రేపల్లె శాసనసభ్యులు, టిడిపి జనసేన బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడిపి క్రిస్టియన్ సెల్ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు రెబ్బా ప్రేమ్ చంద్ పిలుపునిచ్చారు. మంగళవారం చెరుకుపల్లిలో ప్రేమ్ చంద్ విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన కూటమి అభ్యర్థిగా అనగాని సత్యప్రసాద్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా అభిమానులు భారీగా హాజరు కావాలని కోరారు.
![]() |
![]() |