గుంతకల్లు నియోజకవర్గంలో బుధవారం నామినేషన్ల పర్వం కొనసాగింది. వైఎస్ఆర్సిపి అభ్యర్థి వై. వెంకట్రామిరెడ్డి తన రెండవ, మూడవ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ శ్రీనివాసులు రెడ్డికి అందజేశారు. టిడిపి అభ్యర్థి గుమ్మనూరు జయరాం రెండవ సెట్టు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కె. ప్రభాకర్ రెండవ సెట్టు దాఖలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా జంగం కృష్ణతో పాటు మరో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు.