వైఎస్సార్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లేపాక్షి మండలం సడ్లపల్లికి చెందిన నాగభూషణ ఎంపికయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. నాగభూషణ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. తనను ఎంపిక చేసిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ కు కృతజ్ఞతలు తెలిపారు.