పంగులూరు మండలం బూదవాడ గ్రామంలో శుక్రవారం రాత్రి వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ వైయస్సార్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి హనిమిరెడ్డి సతీమణి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. నా భర్తను ఎమ్మెల్యేగా గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించండి అని ఆమె ప్రజలను కోరారు. వైయస్సార్ పార్టీ అధికారంలోకి వస్తేనే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆదిలక్ష్మి పేర్కొన్నారు.