తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టికెట్లు ఆశించి దక్కని నేతలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. తాడికొండ తాజామాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బాపట్ల ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. ఈ క్రమంలో ఆమెకు పార్టీలో పదవిని అప్పగించారు. తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధిగా తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని నియమించారు. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజేశ్‌నాయుడును రాష్ట్ర కార్యదర్శిగా టీడీపీ నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు స్పష్టం చేశారు.
మరోవైపు తిరుపతి ఎంపీ టికెట్ ఆశించిన పనబాకకు పొత్తు ఎఫెక్ట్ పడింది. ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో.. లక్ష్మికి పార్టీలో ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో పలువురు కొత్తవారికి చోటు కల్పించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్‌ను నియమించారు. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఉన్నం మారుతిచౌదరి, కోడూరు బాలసుబ్రమణ్యం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా కనపర్తి శ్రీనివాసరావు, మాన్వి దేవేంద్రమ్మ, గుడిసె ఆదికృష్ణమ్మ, ఇందుకూరి సుబ్బలక్ష్మి, కేఎం జకీవుల్లా, జంపాల సీతారామయ్య, కేవీవీ సత్యనారాయణరావు, పుట్టం బ్రహ్మానందరెడ్డిని నియమించారు.
రాష్ట్ర కార్యదర్శులుగా గుర్రం వెంకటేశ్, కేసనపల్లి జయరామ్‌నాయుడు, బూరగడ్డ కిషన్‌తేజ, కోటగుల్లి సుబ్బారావు, కల్లపరి బుడ్డారెడ్డి, కిల్లో వెంకట రమేష్‌నాయుడు, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, అయితాబత్తుల సత్యశ్రీ, గేదల శ్రీనుబాబు, మోజూరు తోజోవతిని నియమించినట్లు పేర్కొన్నారు.తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా సాకే వెంకట నరసింహులు, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మల్లెల శ్రీవాణి, కార్యనిర్వాహక కార్యదర్శిగా బిడ్డిక పద్మావతి, తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శిగా సన్నపురెడ్డి ప్రకాశ్‌రెడ్డిని నియమించారు.